Header Banner

APPSC Group 1 Interviews 2025: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ఇంటర్వ్యూ షెడ్యూల్‌ ఇదే..! 1:2 నిష్పత్తిలో ఎంపిక!

  Wed Jun 18, 2025 11:55        Education

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 పోస్టులకు తుది గట్టానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పూర్తికాగా.. తాజాగా ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఇటీవల విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాల్లో 1:2 నిష్పత్తిలో ఇంటర్య్వూకి అభ్యర్ధులను ఎంపిక చేశారు. ఈ ప్రకారంగా మొత్తం 182 మంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. వీరందరికీ జూన్‌ 23 నుంచి జులై 15వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధిత ఇంటర్వ్యూ తేదీలను కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచింది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలు జూన్‌ 10న విడుదలయ్యాయి. మే 3 నుంచి 9 వరకు నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 4,497 మంది అభ్యర్థులు హాజరయ్యారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం పట్టణాల్లోని మొత్తం 13 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఏపీపీఎస్సీ త్వరతగతిన మూల్యాంకనం పూర్తి చేసి పరీక్షలు పూర్తైన కేవలం నెల రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసింది.


ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!


ఇంటర్వ్యూలకు హాజరయ్యే రోజునే అభ్యర్ధులకు ఏపీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కూడా నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్ధులు ముందుగానే అవసరమైన అన్ని సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవల్సి ఉంటుంది. ఇక స్పోర్ట్స్‌ క్యాటగిరీలో ఎంపికైన 42 మంది అభ్యర్థులకు జూన్‌ 17న ఏపీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తి చేసినట్లు కమిషన్‌ కార్యదర్శి తెలిపారు.

కాగా ఏపీపీఎస్సీ మొత్తం 81 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి 2023 నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. తుది దశ అయిన ఇంటర్యూ అనంతరం అభ్యర్ధుల మార్కులతో కూడిన ఫైనల్‌ మెరిట్ లిస్ట్‌ను కమిషన్‌ విడుదల చేస్తుంది. అనంతరం ఎంపికైన వారందరికీ నియామక పత్రాలు అందజేయడం జరగుతుంది.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

YS Jagan: వైసీపీలో హై టెన్షన్! జగన్ పల్నాడు పర్యటన వేళ..

 

Economy Park: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! చంద్రబాబు మరో కీలక నిర్ణయం! రూ.1500 కోట్లతో.. 400 ఎకరాల్లో..

 

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..

 

Gold rates: పసిడి ప్రియులకు శుభవార్త... భారీగా తగ్గిన బంగారం ధరలు!

 

Andhra Economy: చంద్రబాబు సమీక్షలో దిశానిర్దేశం! 15% వృద్ధి లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ!

 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

 Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

Praja Vedika: నేడు (18/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APPSC #Group1Interviews #APPSC2025 #InterviewSchedule #APJobs #AndhraPradesh #Group1Updates #APPSCNews #CivilServices